విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు మృతి, మరో 46 మంది గల్లంతు..!

వియత్నాం దేశంలో భారీ వర్షాలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మొలావ్ తుపాను ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది.

విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు మృతి, మరో 46 మంది గల్లంతు..!
Follow us

|

Updated on: Oct 29, 2020 | 6:43 AM

వియత్నాం దేశంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మొలావ్ తుపాను ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు వరదనీటితో మునిగాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడి ఏడుగురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు. మరో 46 మంది అచూకీ లభించలేదని ఆక్కడి ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మొలావ్ తుపాను ప్రభావంతో మధ్య వియత్నాంలోని క్వాంగ్ నామ్ ప్రావిన్సులో కుండపోత వర్షం కురిసింది. దీంతో బుధవారం రాత్రి రెండు కొండచరియలు విరిగిపడి ఏడుగురు మరణించారు. ఘటనాస్థలానికి అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీవర్షాలతో కొండచరియలు విరిగిపడటం వల్ల 46 మంది గల్లంతు అయ్యారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ పునరావాస పనులు చేపట్టాలని వియత్నాం ప్రధాన మంత్రి న్గుయోన్ జువాన్ ఫుక్ సైనికాధికారులు, అధికారులను ఆదేశించారు. రెండు కొండచరియల మధ్య పడిన బాధితులను రక్షించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సైన్యం రంగంలోకి దిగి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టింది.