Breaking: విశాఖ టీడీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత

విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసు వద్ద రెండు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దస్‌పల్లా భూముల్లో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న టీడీపీ తీరును వైసీపీ నేతలు ఎండగడుతున్నారు. గురువారం ఉదయం నుంచి దస్‌పల్లా భూముల వ్యవహారంలో టీడీపీ, వైసీపీ పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాగడాల ప్రదర్శనతో టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. వారిని అడ్డుకునేందుకు […]

Breaking: విశాఖ టీడీపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 30, 2020 | 7:00 PM

విశాఖ జిల్లా టీడీపీ ఆఫీసు వద్ద రెండు పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దస్‌పల్లా భూముల్లో పార్టీ కార్యాలయం నిర్మించుకున్న టీడీపీ తీరును వైసీపీ నేతలు ఎండగడుతున్నారు. గురువారం ఉదయం నుంచి దస్‌పల్లా భూముల వ్యవహారంలో టీడీపీ, వైసీపీ పార్టీల నేతల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాగడాల ప్రదర్శనతో టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. టిడిపి కార్యాలయం వద్ద వైసిపి శ్రేణులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు సంసిద్దమయ్యారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో టీడీపీ కార్యాలయానికి సమీపంలోనే వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పార్టీ వర్గాలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో వైసీపీ వర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలను వైసీపీ కార్యకర్తలు దహనం చేశారు.