జనసేనకు మాజీ జేడీ గుడ్‌బై: పోతూపోతూ పవన్‌పై బాంబు
జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్‌కు, తనకు మధ్య అంతరం పెరుగుతుండడంతో ఆయన ఏ క్షణమైనా పార్టీని వీడొచ్చని అందరూ అంఛనా వేస్తున్న తరుణంలో ఊహాగానాలకు అనుగుణంగానే లక్ష్మినారాయణ జనసేన పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే… అందుకు ఆయన చూపిన కారణం మాత్రం వెరైటీగా వుంది. జనసేన పార్టీని వీడుతున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత ఎన్నికల్లో విశాఖ […]
జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్‌కు, తనకు మధ్య అంతరం పెరుగుతుండడంతో ఆయన ఏ క్షణమైనా పార్టీని వీడొచ్చని అందరూ అంఛనా వేస్తున్న తరుణంలో ఊహాగానాలకు అనుగుణంగానే లక్ష్మినారాయణ జనసేన పార్టీకి దూరమవుతున్నట్లు ప్రకటించారు. అయితే… అందుకు ఆయన చూపిన కారణం మాత్రం వెరైటీగా వుంది.
జనసేన పార్టీని వీడుతున్నట్లు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. గత ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మినారాయణ గత కొంత కాలంగా పార్టీలో అంటీముట్టనట్లుగానే వుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు, పవన్ కల్యాణ్‌కు అంతరం పెరగుతోందని మీడియా కథనాలొచ్చాయి.
వాటిని అటు పార్టీగానీ, ఇటు వ్యక్తిగతంగా లక్ష్మినారాయణగానీ ఖండించలేదు. ఈలోగా గురువారం సాయంత్రం లక్ష్మినారాయణ స్వయంగా ప్రకటన విడుదల చేస్తూ.. జనసేనకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. విశాఖనుంచి పోటీ చేసే అవకాశమిచ్చిన పవన్ కల్యాణ్‌కు, తనకు ఓట్లేసిన ప్రజలకు, తనకోసం పని చేసిన ప్రజలకు కృతఙ్ఞతలు చెప్పారు. అయితే.. లేఖలో తన రాజీనామాకు కారణం పవన్ కల్యాణేనని తెలపడం మాత్రం జనసేనాధిపతికి షాకిచ్చే అంశమే.
రాజకీయాల్లో పూర్తి కాలం కొనసాగేందుకు ఇకపై సినిమాల్లో నటించనని పవన్ కల్యాణ్ పలు మార్లు చెప్పారని, తాజాగా ఆయన వరుసగా సినిమాలతో బిజీ అవుతున్నారని లక్ష్మినారాయణ అన్నారు. అంతటితో ఆగకుండా.. పవన్ కల్యాణ్‌కు నిలకడ లేదన్న విషయం ఆయన సినిమాల్లో నటించడంతోనే అర్థమైపోతుందని, అందుకే నిలకడ లేని వ్యక్తితో రాజకీయ ప్రయాణం చేయలేక పార్టీకి గుడ్‌బై చెబుతున్నానని లక్ష్మినారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.