AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీలో మరో వికెట్ డౌన్…మోదుగుల రాజీనామా

అమరావతి: తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమని అనుకున్న.. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదుగుల ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖలను స్పీకర్‌కు, తెదేపా అధినేత చంద్రబాబుకు పంపించారు. మోదుగుల తెలుగుదేశం పార్టీని వీడతారనే ఊహాగానాలు చాన్నాళ్ల నుంచినే ఉన్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు […]

టీడీపీలో మరో వికెట్ డౌన్...మోదుగుల రాజీనామా
Ram Naramaneni
|

Updated on: Mar 05, 2019 | 6:51 PM

Share

అమరావతి: తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమని అనుకున్న.. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ లాంఛనాన్ని పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదుగుల ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖలను స్పీకర్‌కు, తెదేపా అధినేత చంద్రబాబుకు పంపించారు.

మోదుగుల తెలుగుదేశం పార్టీని వీడతారనే ఊహాగానాలు చాన్నాళ్ల నుంచినే ఉన్నాయి. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. గుంటూరు లోక్ సభ సీటు పరిధిలోని అసెంబ్లీ సీట్లకు జరిగిన రివ్యూ మీటింగ్ కు కూడా మోదుగుల హాజరు కాలేదు.

మోదుగుల టీడీపీని వీడినట్టేనని.. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదుగుల రాజీనామాతో లాంఛనాన్ని పూర్తి చేశారు. అతి త్వరలోనే మోదుగుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ను కలిసి, ఆ పార్టీలోకి చేరబోతున్నారని తెలుస్తోంది.

Follow Us