ముంబైలోని చెంబూర్‌లో స్కూల్ బస్సుపై భారీ చెట్టు కూలడంతో 11 ఏళ్ల విహాన్ శ్రీవాత్సవ్ ప్రాణాలు కోల్పోయాడు. క్రికెటర్ కావాలని కలలు కన్న కొడుకు అకాల మరణంతో విహాన్ తల్లి కుంగిపోయింది. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు, తమకు సమాధానం ఎవరు చెబుతారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. బస్సులోని ఇతర నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.