మార్పు మంచికే..నెల రోజులు ఈ నీలి రంగు చాయ్‌ తాగి చూడండి!

02 July  2026

Jyothi Gadda

మనకు గ్రీన్ టీ, బ్లాక్ టీల గురించి బాగా తెలుసు. కానీ, గత కొంతకాలంగా హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ప్రపంచంలో బ్లూ టీ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంటోంది. నీలి రంగు శంఖం పువ్వుల నుండి ఈ టీని తయారు చేస్తారు.

బ్లూ టీ బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆప్షన్. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది

ఈ హెర్బల్ టీలో యాంటీఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, అవయవాలలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్ బయటకు పంపడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. 

శంఖం పువ్వులలో ఉండే యాంటీ-గ్లైకేషన్, ఆంథోసైనిన్ అనే సమ్మేళనాలు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల ముఖంపై ముడతలు తగ్గి, చర్మం యవ్వనంగా మెరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఈ టీ ఒక సహజమైన స్ట్రెస్ బస్టర్‌గా పనిచేస్తుంది. బిజీ లైఫ్‌స్టైల్ వల్ల వచ్చే అలసట, మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి, మనస్సుకు ప్రశాంతతను చేకూర్చడంలో బ్లూ టీలోని గుణాలు సహాయపడతాయి.

ఒక కప్పు నీటిని బాగా మరిగించి, అందులో 4-5 ఎండిన లేదా తాజా శంఖం పువ్వులను వేసి 5 నిమిషాల పాటు మూతపెట్టాలి. నీరు పూర్తిగా నీలి రంగులోకి మారాక వడకట్టుకోవాలి.

ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. (గమనిక: నిమ్మరసం కలిపినప్పుడు ఈ బ్లూ టీ రంగు అద్భుతంగా పర్పుల్/లైట్ గులాబీ రంగులోకి మారుతుంది.

ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ అపరాజిత ఫ్లవర్ టీ ఎంతో మేలు చేస్తుంది.