AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చేతికి కట్టుతో ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. స్టన్నింగ్ లుక్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో అతడు. ముఖ్యంగా యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ హీరో.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

Tollywood : చేతికి కట్టుతో ఫోటో షేర్ చేసిన టాలీవుడ్ హీరో.. స్టన్నింగ్ లుక్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
Nani
Rajitha Chanti
|

Updated on: Jul 02, 2026 | 2:06 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో విపరతీమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా తన కొత్త సినిమా కోసం తన బాడీ మేకోవర్ పూర్తిగా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా.. న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఈ హీరో మరెవరో కాదండి.. న్యాచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నాని.. అష్టా చెమ్మా సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తన ప్రతిభతో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నాని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం నాని లుక్ పూర్తిగా మార్చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

ఇదిలా ఉంటే.. తాజాగా నాని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరలవుతున్నాయి. అందులో నాని లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. లాంగ్ హెయిర్.. గుబురు గడ్డం, స్టన్నింగ్ బాడీ లుక్ తో కనిపించారు నాని. అలాగే ఆ ఫోటోలలో నాని ఎడమచేతి మోచేతికి పెద్ద బ్యాండేజ్ కట్టి ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫోటోస్ షేర్ చేస్తూ.. “ఘాయల్ హూ.. ఇస్లీయే ఘాతక్ హూ” (గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను) అంటూ ఒక పవర్‌ఫుల్ దురందర్ సినిమా డైలాగ్‌ను క్యాప్షన్‌గా జోడించారు. జూలై నెలను ఇలాంటి ఒక క్రేజీ అప్‌డేట్‌తో ప్రారంభించిన నాని, త్వరలోనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

అయితే ఈ గాయం సినిమా షూటింగ్ సమయంలో జరిగిందా లేదా మరేదైనా కారణమా అనే విషయంపై నాని ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక నాని లుక్ చూసి ఫైర్ అంటూ ఎమోజీస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

హీరో నాని ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us