AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాలపై సమీక్ష నిర్వహిస్తూ ఉంది. వీటిల్లో సవరణలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజా సమీక్షలో మరోసారి ట్యాక్సులను పెంచింది. వీటిని విండ్ ఫాల్ ట్యాక్సుగా పిలుస్తారు.

Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ న్యూస్.. ట్యాక్సులు మరోసారి పెంపు..
Petrol
Venkatrao Lella
|

Updated on: Sep 01, 2026 | 9:59 PM

Share

పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి ట్యాక్సుల్లో మార్పులు చేసింది. నేటి నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెట్రోల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్సును లీటర్‌కు సున్నా నుంచి రూ.1.5కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక డీజిల్ ఎగుమతులపై కూడా సుంకాన్ని పెంచింది. డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు లీటర్‌కు రూ.24గా ఉండగా.. ఇవాళ రూ.25కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటన జారీ చేసింది. అయితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై సుంకాన్ని స్వల్పంగా తగ్గించారు.

15 రోజులకు ఒకసారి సమీక్ష

ఏటీఎఫ్ ఫ్యూయల్‌పై ఎగుమతి సుంకాన్ని రూ.19కి తగ్గించారు. కేంద్రం ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎగుమతి సుంకాల్లో సవరణలు చేస్తూ ఉంటుంది. ఆగస్ట్ 15న జరిపిన సమీక్షలో పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని సున్నాకు పరిమితం చేశారు. డీజిల్‌పై రూ.24, ఏటీఎఫ్‌పై రూ.19.5గా నిర్ణయించారు. ఇప్పుడు వాటిల్లో సవరణలు చేశారు. పెట్రోల్ ఎగుమతులపై విధించే ట్యాక్స్ అదనపు ఎక్సైజ్ సుంకంగా ఉంటుంది. అయితే డీజిల్‌పై విధించే సుంకంలో రూ.24 అదనపు ఎక్సైజ్ సుంకంగా ఉండనుండగా.. రూ.1 రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌గా విధిస్తారు. ఇక ఏటీఎఫ్‌పై విధించే ట్యాక్స్ పూర్తిగా అదనపు ఎక్సైజ్ సుంకంగానే ఉంటుంది.

ఈ కంపెనీలపై ప్రభావం

దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ప్యూయెల్‌పై ఈ సుంకాలు విధిస్తారు. ఇక్కడ పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు ధరల్లో కదరికలను బట్టి ఈ ట్యాక్సుల్లో మార్పులు చేస్తూ ఉంటారు. పశ్చిమాసియాలో సంక్షోభం క్రమంలో దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు మార్చి 27,2026 నుంచి ఎగుమతి సుంకాలను కేంద్రం విధిస్తోంది. తాజా సమీక్షలో పెట్రోల్ ఎగుమతులపై సుంకాన్ని పెంచగా.. డీజిల్‌పై లీటర్‌కు రూ.1 పెంచగా.. ఏటీఎఫ్‌పై లీటర్‌కు 50 పైసలు తగ్గించింది,

Follow Us