AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ మాత్రల అనంతరం పలువురు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. 71 మందికి మాత్రలు పంపిణీ చేయగా.. 53 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 46 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మడివి జమున (7) అనే చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఏజెన్సీలో తీవ్ర విషాదం.. మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి.. సీఎం కీలక ఆదేశాలు..
Polavaram Malaria Incident
Anand T
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 6:40 AM

Share

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది.. మరో 53 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కొందరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 46 మంది రెండు నుంచి పదేళ్లలోపువారు కాగా మిగిలిన ఏడుగురు పెద్దలున్నారని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారి పరిస్థితి నిలకడగా ఉందని.. చికిత్స కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

71 మందికి క్లోరోక్విన్‌ మాత్రలు..

మంగళవారం మధ్యాహ్నం వైద్య సిబ్బంది మలేరియా నివారణకు క్లోరోక్విన్‌ మాత్రలను విద్యార్థులు సహా 71 మందికి అందజేశారు. అనంతరం మడివి జమున (7) ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడంతో లక్ష్మీపురం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతోపాటు.. పాఠశాల, అంగన్‌వాడీ చిన్నారులు సైతం అస్వస్థతకు గురవడంతో జిల్లా యంత్రాంగం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం కీలక ఆదేశాలు..

కాగా.. పోలవరం జిల్లా గొల్లగుప్ప ఘటనపై సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వమించారు. మలేరియా నివారణ క్లోరోక్విన్ టాబ్లెట్లు వికటించి ఒక బాలిక చనిపోయిందనే సమాచారంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 71 మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన వారిలో 29 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మరో 24 మందికి లక్ష్మీపురం పిహెచ్‌సిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షల నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఆసుపత్రికి వెళ్లి బాధితుల పరిస్థితిని చింతూరు ITDO PO, ASP, ఇతర అధికారులు తెలుసుకున్నారని, ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరు చనిపోయారనేది నిజం కాదని అధికారులు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్ నుంచి ఇప్పటికే 9 మంది సభ్యుల వైద్య బృందాన్ని పంపించినట్లు తెలిపారు.

మరో మూడు ప్రత్యేక బృందాలు విజయవాడ, రాజమండ్రి, కాకినాడ బయలుదేరినట్లు కలెక్టర్ దినేష్ వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సిఎం ఆదేశించారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్