భోజనానికి ముందు ఉసిరికాయ తింటే.. ఇంత లాభమా!

02-07-2026

Pic credit - Instagram

Phani Ch

భోజనానికి ముందు ఉసిరికాయ ముక్కలను నమిలి తినడం వల్ల జీర్ణక్రియ రేటు క్రమబద్ధం చేయబడి, గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా అస్సలు పెరగవు.

తాజా నివేదికల ప్రకారం.. ఉసిరిలో లభించే పాలిఫెనాల్స్ గ్లూకోజ్ జీవక్రియను బాగా మెరుగుపరుస్తాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో మధుమేహ రోగులకు ఇది ఎంతో ముఖ్యం.

ఉసిరికాయలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఉసిరికాయ తినడం వల్ల మన శరీరానికి ఏకంగా 600 నుండి 700 మిల్లీ గ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలు చేస్తుంది. అయితే, మార్కెట్లో దొరికే కృత్రిమ జ్యూస్‌ల కంటే, పచ్చి ఉసిరికాయను నేరుగా తినడం వల్ల పూర్తి స్థాయి పీచు పదార్థం, పోషకాలు అందుతాయి.

ఉసిరికాయ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుంది కదా అని మోతాదుకు మించి తీసుకోకూడదు.

అతిగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రోజుకు ఒక మీడియం సైజ్ ఉసిరికాయ లేదా అర ముక్క తింటే ఆరోగ్యానికి సరిపోతుంది.

భోజనానికి 15 నిమిషాల ముందు ఉసిరి తినే అలవాటు చేసుకోండి. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి, హఠాత్తుగా పెరిగే షుగర్ స్పైక్స్‌ను బాగా అడ్డుకుంటుంది.