ఉపసభాపతిగా పద్మారావు గౌడ్ ఏకగ్రీవం
తెలంగాణ ఉపసభాపతిగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పద్మారావు డిప్యూటీ స్పీకర్ అని అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక అనంతరం ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ ను సీఎం కేసీఆర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువరు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి పద్మారావుకు అభినందనలు తెలియజేశారు. కాగా.. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే […]
తెలంగాణ ఉపసభాపతిగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పద్మారావు డిప్యూటీ స్పీకర్ అని అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక అనంతరం ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ ను సీఎం కేసీఆర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువరు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి పద్మారావుకు అభినందనలు తెలియజేశారు.
కాగా.. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 2014 నుంచి 2018 వరకు పద్మారావు ఎక్సైజ్, అబ్కారీ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.