AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశాల నుంచి ముందుగా రప్పించేది వీరినే.. కారణమిదే

విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అయితే, వేలాది మంది స్వదేశానికి రావాలని కోరుకుంటుండడంతో ఏ ప్రాతిపదికన ఎవరికి ముందుగా ఛాన్స్ ఇవ్వాలనేది కేంద్రానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఓ పార్ములాను రూపొందించిన కేంద్ర ప్రభుత్వం వివాదాలకు అవకాశం లేకుండా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది.

విదేశాల నుంచి ముందుగా రప్పించేది వీరినే.. కారణమిదే
Rajesh Sharma
|

Updated on: May 06, 2020 | 5:11 PM

Share

విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. అయితే, వేలాది మంది స్వదేశానికి రావాలని కోరుకుంటుండడంతో ఏ ప్రాతిపదికన ఎవరికి ముందుగా ఛాన్స్ ఇవ్వాలనేది కేంద్రానికి తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఓ పార్ములాను రూపొందించిన కేంద్ర ప్రభుత్వం వివాదాలకు అవకాశం లేకుండా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది.

కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి చేర్చేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొదటి గల్ఫ్ యుద్ధం తరువాత జరిగిన తరలింపు కార్యక్రమం తర్వాత మళ్ళీ ఇదే అతిపెద్ద తరలింపు కార్యక్రమమని విదేశాంగ శాఖాధికారులు చెబుతున్నారు. ఇందు కోసం మే 7 వ తేదీ నుండి నుండి విమానాలు, నౌకల ద్వారా విదేశాల నుండి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పటికే మొత్తం 1,90,000 మంది భారతీయులు ఆయా దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల్లో, హైకమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారు.

మొదటి దశలో వాయు మార్గాన 13 దేశాలనుండి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో మనదేశానికి తీసుకురానున్నామని కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. మొదటి దశలో అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, బాంగ్లాదేశ్, యుకె, యు.ఏ.ఈ., సౌదీ, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ వంటి 12 దేశాల నుంచి భారత విమానాలు అక్కడున్న భారతీయులను తిరిగి తీసుకువస్తాయన్నారు. సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఒక్కో విమానంలో 200 నుండి 300 మందిని తీసుకువస్తామన్నారు కిషన్ రెడ్డి.

అయితే ఎవరిని ముందుగా భారత్‌కు తరలిస్తారనే విషయంలో కేంద్ర పాటిస్తున్న వివాదరహిత విధానాన్ని కిషన్ రెడ్డి వెల్లడించారు. ముందుగా ఆయా దేశాల నుండి వెలి వేయబడినవారిని, ఆ తర్వాత వీసా గడువు ముగిసినవారిని తీసుకువస్తామని చెప్పారాయన. ఆ తర్వాత వలస కార్మికులు, ఆ తర్వాత ఆరోగ్యరీత్యా భారత్‌లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైనవారు, ఆపైన గర్భిణులను తరలిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత భారత్‌‌‌లో చనిపోయిన వారి బంధువులను, ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులను, విదేశాల్లో హాస్టల్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కుంటున్న విద్యార్థులను తరలిస్తామని చెప్పారు.

భారత్‌కు రాదల్చుకున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించబడి సర్టిఫికెట్ పొంది ఉండాల్స వుందన్నారు. వారు ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ రకంగా విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తి 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందని. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటెన్ కేంద్రాలను నిర్వహిస్తాయని కిషన్ రెడ్డి వివరించారు. అదే విధంగా రక్షణశాఖ ఆధ్వర్యంలోని నౌకల ద్వారా కొన్ని దేశాల నుండి మన దేశస్థులను తీసుకువచ్చే కార్యక్రమం మన భారత ప్రభుత్వం అధ్వర్యంలో కొనసాగనున్నదన్నారు.