చెరువుగట్టు శివపార్వతుల కళ్యాణ౦

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Oct 18, 2020 | 7:52 PM

నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలో మీటర్ల దూరంలో ఉంది. చెరువుగట్టు లోని […]

చెరువుగట్టు శివపార్వతుల కళ్యాణ౦

నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, ఆ చెరువు గట్టున పార్వతీ సమేత మల్లిఖార్జున స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి పశ్చిమాన గల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ క్షేత్రం నల్గొండకు 14 కిలో మీటర్ల దూరంలో ఉంది.

చెరువుగట్టు లోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతోంది. మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu