ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంతిమయాత్ర
తమ అభిమాన గాయకుడు.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కడసారి చూపుకోసం ఆయన అభిమానులు పోటీ పడుతున్నారు. 55 ఏళ్లుగా పాటతోనే జీవిత ప్రయాణం సాగించిన బాలుకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. బాలు చివరి కోరిక మేరకు తిరువల్లూరు జిల్లా తామరై పాక్కం ఫామ్ హౌస్ లో అతని అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో ఫామ్ హౌస్ వద్దకు ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎపి ప్రభుత్వం తరపున బాలు […]
తమ అభిమాన గాయకుడు.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కడసారి చూపుకోసం ఆయన అభిమానులు పోటీ పడుతున్నారు. 55 ఏళ్లుగా పాటతోనే జీవిత ప్రయాణం సాగించిన బాలుకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. బాలు చివరి కోరిక మేరకు తిరువల్లూరు జిల్లా తామరై పాక్కం ఫామ్ హౌస్ లో అతని అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో ఫామ్ హౌస్ వద్దకు ఆయన అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎపి ప్రభుత్వం తరపున బాలు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా చేరుకున్నారు. బాలు పార్థివ దేహానికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ అంజలి ఘటిస్తున్నారు. ఇలాఉంటే, ఆన్ లైన్ మాధ్యమాల్లో ఏ చోట విన్నా.. ఎందరి వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ డీపీ, స్టేటస్ లు చూసినా తమ అభిమాన గాయకుడ్ని ఆరాధిస్తూ ఆయన ఫొటోలు, వీడియోలు, పాటల్నే పెట్టుకుంటున్నారు అభిమానులు. ఆపాత మధురం.. ఆ పాట మధురం.. ఆ స్వరం అజరామరం.. ఆచంద్రతారార్కం అంటూ కీర్తిస్తున్నారు.