చెన్నైలో స్ట్రీట్ ఫైట్..లాఠీ ఛార్జీ.. పీఎంకే ఆందోళన.. రైళ్ళను నిలిపేసిన అధికారులు

చెన్నై నగరంలో ఉద్రిక్తత నెలకొంది. దాంతో అధికారులు రైళ్లను నిలిపివేశారు. పీఎంకే పార్టీ ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. ఆందోళనకారులు రైళ్ళపై...

చెన్నైలో స్ట్రీట్ ఫైట్..లాఠీ ఛార్జీ.. పీఎంకే ఆందోళన.. రైళ్ళను నిలిపేసిన అధికారులు
Follow us

|

Updated on: Dec 01, 2020 | 12:44 PM

Severe tension in Chennai city: చెన్నై నగరంలో ఉద్రిక్తత నెలకొంది. దాంతో అధికారులు రైళ్లను నిలిపివేశారు. పీఎంకే పార్టీ ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో.. ఆందోళనకారులు రైళ్ళపై రాళ్లు రువ్వారు. దాంతో రైళ్ళను నిలిపి వేయాల్సి వచ్చింది. వన్నియర్ వర్గానికి రిజర్వేషన్స్‌పై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పీఎంకే పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

పీఎంకే ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అటుగా వెళుతున్న రైళ్లపై రాళ్ళ దాడికి దిగారు. ఇతర జిల్లాల నుండి వేల సంఖ్యలో చెన్నై నగరం ముట్టడికి వస్తున్న వారిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పలు చోట్ల వాహనాలను ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. లోకల్ ట్రైన్ సేవలను అధికారులు నిలిపేశారు.