ఆర్జీవీ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

హైదరాబాద్‌లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘దిశాఎన్‌కౌంట‌ర్’. ఈ సినిమా గురించి నిన్న చెప్పినట్టే వర్మ ఈ ఉదయం 9 గంటల 8 నిమిషాలకు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు. దిశ బండికి గాలితీసేయడం.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు దిశను కాల్చివేయడం తదితర ఘటనలు ట్రైలర్ లో చూపించాడు వర్మ. న‌వంబ‌ర్ 26, 2020లో సినిమా విడుద‌ల‌ కాబోతుంది. హైదరాబాద్ […]

ఆర్జీవీ 'దిశ ఎన్ కౌంటర్' ట్రైలర్
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 26, 2020 | 9:45 AM

హైదరాబాద్‌లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సినిమా ‘దిశాఎన్‌కౌంట‌ర్’. ఈ సినిమా గురించి నిన్న చెప్పినట్టే వర్మ ఈ ఉదయం 9 గంటల 8 నిమిషాలకు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు. దిశ బండికి గాలితీసేయడం.. శంషాబాద్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర నలుగురు నిందితులు దిశను కాల్చివేయడం తదితర ఘటనలు ట్రైలర్ లో చూపించాడు వర్మ. న‌వంబ‌ర్ 26, 2020లో సినిమా విడుద‌ల‌ కాబోతుంది.

హైదరాబాద్ లో ఏడాది క్రితం సంచలనం రేపింది వెటర్నరీ డాక్టర్‌ దిశ అత్యాచార ఘటన. ఈ కేసులో నిందితులు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి నిన్న న్యూలుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు వర్మ. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.