AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మృతి

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నపురంలో పోలీసులు – మావోయిస్టులు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతి చెందిన మావోయిస్టులు చర్ల, శబరి ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రేదేశంలో ఒక పిస్టల్, ఒక 8.mm రైఫిల్, బ్లాస్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్ట్ 16 వ ఆవిర్భావ […]

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మృతి
Venkata Narayana
|

Updated on: Sep 24, 2020 | 11:03 AM

Share

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నపురంలో పోలీసులు – మావోయిస్టులు మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతి చెందిన మావోయిస్టులు చర్ల, శబరి ఏరియా కమిటీ సభ్యులుగా పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రేదేశంలో ఒక పిస్టల్, ఒక 8.mm రైఫిల్, బ్లాస్టింగ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్ట్ 16 వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని మావోయిస్ట్ లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. భద్రాద్రి జిల్లా స్పెషల్ పోలీస్ టీమ్ చర్ల మండలంలోని చెన్న పురం అటవీప్రాంతంలో పక్కా సమాచారంతో కుంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో మావోయిస్టులు తారస పడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు సమాచారం.

Follow Us