రేపటి ను౦డి పెద్దగట్టు జాతర ప్రార౦భ౦

రేపటి ను౦డి పెద్దగట్టు జాతర ప్రార౦భ౦

సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లిలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు పక్కరాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. దురాజ్‌పల్లి లింగమంతుల జాతర ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఫిబ్రవరి నెలలో జరుగుతు౦ది. ఈ జాతరకు సుమారు పది లక్షల నుండి 15 లక్షల మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు ఇందులో భాగంగా సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవత విగ్రహాలను తీసుకొచ్చి దిష్టిపూజ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:14 PM

సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లిలో పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఈ నెల 24నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు పక్కరాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. దురాజ్‌పల్లి లింగమంతుల జాతర ప్రతి రెండు సంవత్సరాల ఒకసారి ఫిబ్రవరి నెలలో జరుగుతు౦ది. ఈ జాతరకు సుమారు పది లక్షల నుండి 15 లక్షల మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు

ఇందులో భాగంగా సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవత విగ్రహాలను తీసుకొచ్చి దిష్టిపూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దిష్టిపూజ ప్రారంభం నుంచి జాతర ముగిసే వరకు ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కళకళాడుతుంది. భక్తులు సౌడమ్మ, యలమంచమ్మ దేవతలకు వేటలు బలి ఇస్తారు. భక్తి శ్రద్దలతో నైవెద్యాలు, బోనాలు, పసుపు కుంకుమలు సమర్పిస్తారు. కాగా.. జాతర ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌ శుక్రవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ జాతరకు రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి గుట్టకు ఇరువైపులా సిసి రోడ్లు, డ్రైనేజి, భక్తులకు మౌలిక సదుపాయాలు, గుట్టపైన క్షౌరశాల, పూజారులకు అతిధిగృహం, వాటర్ ట్యాంకు, కోనేరు, నిరంతర విద్యుత్తు ఏర్పాటు కోసం ప్రత్యేక సబ్‌స్టేషన్, ఆలయ మండపానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో యాదవ భక్తులు, పూజారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu