పాక్ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి వైదొలగిన ఇంజమామ్

పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ తన పదవి నుంచి వైదలగారు. బోర్టు ఆదేశిస్తే కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈనెల 30తో ఇంజమామ్ పదవీకాలం ముగియనుంది. చీఫ్ సెలక్టర్‌గా మూడేళ్లకు పైగా పనిచేసిన అతను.. తన ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2020లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో తాజా ఆలోచనలు, ప్రయోగాలు చేసేందుకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌ను […]

పాక్ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి వైదొలగిన ఇంజమామ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 18, 2019 | 7:23 AM

పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్-ఉల్-హక్ తన పదవి నుంచి వైదలగారు. బోర్టు ఆదేశిస్తే కొత్త బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఈనెల 30తో ఇంజమామ్ పదవీకాలం ముగియనుంది. చీఫ్ సెలక్టర్‌గా మూడేళ్లకు పైగా పనిచేసిన అతను.. తన ఒప్పందాన్ని పొడిగించుకునేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌, 2020లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌, 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో తాజా ఆలోచనలు, ప్రయోగాలు చేసేందుకు కొత్త చీఫ్‌ సెలక్టర్‌ను నియమించుకోవడం సరైందిగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. పీసీబీ చైర్మన్ ఎహ్‌సన్‌మని, మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్‌తో వేర్వేరుగా మాట్లాడానని.. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపానన్నారు. ఏది ఏమైనప్పటికి అన్నీ పాక్ క్రికెట్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే చేశానని.. అభిమానులు తనను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఇంజమామ్ తెలిపారు.