కశ్మీరీ యువతులపై హర్యానా సీఎం హాట్ కామెంట్స్

దేశంలోని ముస్లిం యువకులు ఇక నుంచి అందంగా, తెల్లగా ఉన్న కశ్మీరీ బాలికలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడొచ్చనే ఆనందంలో ఉన్నారన్న యూపీ ముజఫ్ఫర్‌నగర్ ఎమ్మెల్యే విక్రం సైనీ వ్యాఖ్యలు మరిచిపోకముందే .. ఏకంగా హర్యానా ముఖ్యమంత్రి కూడా కశ్మీరీ యువతులను ఉద్దేశించి మాట్లాడారు. . హర్యానాలో జరిగిన బేటీ బచావో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ .. మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని కానీ ఇప్పుడు ఏకంగా […]

కశ్మీరీ యువతులపై హర్యానా సీఎం హాట్ కామెంట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2019 | 2:49 PM

దేశంలోని ముస్లిం యువకులు ఇక నుంచి అందంగా, తెల్లగా ఉన్న కశ్మీరీ బాలికలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడొచ్చనే ఆనందంలో ఉన్నారన్న యూపీ ముజఫ్ఫర్‌నగర్ ఎమ్మెల్యే విక్రం సైనీ వ్యాఖ్యలు మరిచిపోకముందే .. ఏకంగా హర్యానా ముఖ్యమంత్రి కూడా కశ్మీరీ యువతులను ఉద్దేశించి మాట్లాడారు. . హర్యానాలో జరిగిన బేటీ బచావో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ .. మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని కానీ ఇప్పుడు ఏకంగా కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యిందని వ్యాఖ్యానించారు.

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత బీజేపీకి చెందిన నేతలు ఈవిధంగా వ్యాఖ్యానించడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఆడవారిని కేవలం ఒకే కోణంలో చూడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.