బ్రేకింగ్: విజయవాడ గోశాలలో 100 ఆవులు మృతి..!

విజయవాడ నగర శివారు కొత్తూరులోని దారుణం చోటుచేసుకుంది. కొత్తూరులోని తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. గోశాలలో మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య ఉన్నాయి. రాత్రి ఆవులకు పెట్టిన దాణాలపై అనుమానం వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో గోవులకు రోజూ పెట్టినట్టే దాణా పెట్టానని కాపలాగా వున్న వ్యక్తి తెలిపాడు. అయితే.. ఉదయం చూసేసరికి వంద ఆవులకి పైగా మృతి చెందినట్టు.. అసలు ఏమైయిందో తెలీదని కాపలాగావున్న వ్యక్తి చెబుతున్నాడు. దీంతో.. వెంటనే ఆవులకి […]

బ్రేకింగ్: విజయవాడ గోశాలలో 100 ఆవులు మృతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 10, 2019 | 10:05 AM

విజయవాడ నగర శివారు కొత్తూరులోని దారుణం చోటుచేసుకుంది. కొత్తూరులోని తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృతి చెందాయి. గోశాలలో మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య ఉన్నాయి. రాత్రి ఆవులకు పెట్టిన దాణాలపై అనుమానం వ్యక్తమవుతోంది. రాత్రి 10 గంటల సమయంలో గోవులకు రోజూ పెట్టినట్టే దాణా పెట్టానని కాపలాగా వున్న వ్యక్తి తెలిపాడు. అయితే.. ఉదయం చూసేసరికి వంద ఆవులకి పైగా మృతి చెందినట్టు.. అసలు ఏమైయిందో తెలీదని కాపలాగావున్న వ్యక్తి చెబుతున్నాడు. దీంతో.. వెంటనే ఆవులకి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. దాదాపు 100 ఆవులకి పైగా మృతి చెందడంతో స్థానికంగా ఈ విషయం కలకలం రేపుతోంది.