డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్‍తో కొత్త‌ ‘క్లాసిక్ 350’ బైక్

ప్రఖ్యాత వాహన తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తన క్లాసిక్ 350 బేస్ వేరియంట్‌ను అప్‌డేట్ చేసింది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌ను జతచేసింది. బైక్ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,53,245. నాన్ ఏబీఎస్ వేరియంట్‌తో పోలిస్తే తాజా బైక్ ధర దాదాపు రూ.6,000 ఎక్కువ. డ్యూయెల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ జతచేసినప్పుడు బైక్ ధర ఇంత తక్కువ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఏబీఎస్ మినహా అప్‌డేటెడ్ క్లాసిక్ 350 బైక్‌లో వేరే ఇతర […]

డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్‍తో కొత్త‌ 'క్లాసిక్ 350' బైక్
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 02, 2019 | 4:04 PM

ప్రఖ్యాత వాహన తయారీ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా తన క్లాసిక్ 350 బేస్ వేరియంట్‌ను అప్‌డేట్ చేసింది. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్‌ను జతచేసింది. బైక్ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,53,245. నాన్ ఏబీఎస్ వేరియంట్‌తో పోలిస్తే తాజా బైక్ ధర దాదాపు రూ.6,000 ఎక్కువ. డ్యూయెల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ జతచేసినప్పుడు బైక్ ధర ఇంత తక్కువ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.

ఏబీఎస్ మినహా అప్‌డేటెడ్ క్లాసిక్ 350 బైక్‌లో వేరే ఇతర మార్పులు ఏమీ లేవు. ఈ బైక్‌లో 346 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 19.8 హెచ్‌పీ@5250 ఆర్‌పీఎం, మాగ్జిమమ్ టార్క్ 28 ఎన్ఎం@4000 ఆర్‌పీఎం. బైక్‌లో ఐదు గేర్లు ఉంటాయి.

కంపెనీ ఇప్పటికే క్లాసిక్ 350 రేంజ్‌ను డ్యూయెల్ చానల్ ఏబీఎస్‌తో అప్‌డేట్ చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, 350 ఈఎస్ బైక్స్‌లో ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఏప్రిల్ 1లోపు వీటిల్లోనూ డ్యూయెల్ చానల్ ఏబీఎస్ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu