పరీక్ష రాస్తూనే చనిపోయిన ఇంటర్ విద్యార్ధి
హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాస్తూనే ఓ విద్యార్ధి అకస్మాత్తుగా ఒరిగిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే మార్గం మధ్యలోనే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ప్యారడైజ్ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో గోపారీజ్ అనే ఇంటర్ విద్యార్ధి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పరీక్ష నిర్వాహకులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు చెప్పారు. సమాచారం తెలసుకున్న కుటుంబ సభ్యులు […]

హైదరాబాద్: ఇంటర్ పరీక్ష రాస్తూనే ఓ విద్యార్ధి అకస్మాత్తుగా ఒరిగిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే మార్గం మధ్యలోనే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. సికింద్రాబాద్‌లో ప్యారడైజ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ప్యారడైజ్ వద్ద ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో గోపారీజ్ అనే ఇంటర్ విద్యార్ధి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
పరీక్ష నిర్వాహకులు హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు చెప్పారు. సమాచారం తెలసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గోపారాజ్ ఎల్లారెడ్డిగూడలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతనిది ఖమ్మం జిల్లా.



