మార్చి 15న రానున్న ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’
ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మాణంలో యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రమే ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన ఈ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సినిమా […]

ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మాణంలో యువ దర్శకుడు నాగసాయి మాకం తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రమే ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించిన ఈ చిత్రంలో గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సినిమా ధ్యేయం వినోదాన్ని పంచడం. అయితే నవ్విస్తూ ఒక చిన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగిస్తే ఆ చిత్రానికి సార్థకత చేకూరినట్లే అని అన్నారు.
దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ ‘నా తొలి చిత్రం ప్రేక్షకుల తీర్పునకు వస్తుండటం సంతోషంగా ఉంది. మేము రూపొందించిన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోందని తెలిపారు. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది’ అని అన్నారు.



