సీఏఏపై మధ్యప్రదేశ్ కూడా.. వెనక్కి తీసుకోవలసిందే !

వివాదాస్పద సీఏఏపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది.  దీన్ని రద్దు చేయాలని  కేంద్రాన్ని కోరుతూ.. బుధవారం మధ్యప్రదేశ్ కేబినెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లో సవరణలు చేయాలని అభ్యర్థించింది. గత వారమే పశ్చిమ బెంగాల్ శాసన సభ.. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేరళ, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల తరువాత ఈ విధమైన తీర్మానాన్ని ఆమోదించిన నాలుగో రాష్టమైంది. కాగా-నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మార్పులు చేయాలని  కోరిన మధ్యప్రదేశ్ కేబినెట్.. దేశవ్యాప్తంగా […]

సీఏఏపై మధ్యప్రదేశ్ కూడా.. వెనక్కి తీసుకోవలసిందే !

వివాదాస్పద సీఏఏపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది.  దీన్ని రద్దు చేయాలని  కేంద్రాన్ని కోరుతూ.. బుధవారం మధ్యప్రదేశ్ కేబినెట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లో సవరణలు చేయాలని అభ్యర్థించింది. గత వారమే పశ్చిమ బెంగాల్ శాసన సభ.. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. కేరళ, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల తరువాత ఈ విధమైన తీర్మానాన్ని ఆమోదించిన నాలుగో రాష్టమైంది. కాగా-నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మార్పులు చేయాలని  కోరిన మధ్యప్రదేశ్ కేబినెట్.. దేశవ్యాప్తంగా భారత పౌరుల రిజిస్టర్ ను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

మతపరమైన కారణాలపై అక్రమ శరణార్ధుల మధ్య ఈ చట్టం (సీఏఏ) వివక్ష చూపేదిగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుధ్ధమని  ఈ తీర్మానం విమర్శించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం మొదటిసారిగా మత ప్రాతిపదికన ప్రజల మధ్య కూడా వారిని వేర్వేరుగా విభజించే విధంగా చట్టం తెచ్చారని, ఇది ఈ దేశ సెక్యులర్ వ్యవస్థకు భంగం కలిగించేదిగా ఉందని మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆరోపించింది. దేశవ్యాప్తంగా ఈ చట్టంపట్ల నిరసనలు పెల్లుబుకుతున్నాయని, పైగా ప్రజల మనస్సుల్లో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయని తీర్మానం పేర్కొంది. ‘దేశ జనాభా రిజిస్టర్ లో కొత్తగా చేసిన సవరణలను తొలగించండి.. ఆ తరువాతే పాపులేషన్ రిజిస్టర్ ని అప్ డేట్ చేయండి’ అని మంత్రులు కోరారు. ఇద్దరు బీజేపీ నేతలు కూడా సీఏఏని విమర్శించారని అంటూ వారి పేర్లను ఈ తీర్మానంలో ప్రస్తావించారు.

Published On - 4:43 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu