పెన్షన్ల తొలగింపుపై టీడీపీ సంచలన నిర్ణయం

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించింది. అందుకు ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తకం ఖరారు చేసింది. ఈ అంశాలను చంద్రబాబు స్వయంగా పార్టీ వర్గాలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. గురువారం ఉదయం చంద్రబాబు పార్టీ రాష్ట్ర, జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 7లక్షల మందికి పించన్ల తొలగింపు అన్యాయమని ఆయనన్నారు. పించన్ల తొలగింపునకు నిరసనగా ఫిబ్రవరి 10వ […]

పెన్షన్ల తొలగింపుపై టీడీపీ సంచలన నిర్ణయం

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది పెన్షన్లు తొలగించారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించింది. అందుకు ఫిబ్రవరి 10వ తేదీన ముహూర్తకం ఖరారు చేసింది. ఈ అంశాలను చంద్రబాబు స్వయంగా పార్టీ వర్గాలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

గురువారం ఉదయం చంద్రబాబు పార్టీ రాష్ట్ర, జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 7లక్షల మందికి పించన్ల తొలగింపు అన్యాయమని ఆయనన్నారు. పించన్ల తొలగింపునకు నిరసనగా ఫిబ్రవరి 10వ తేదీన టిడిపి వర్గాలు పెన్షన్ దారులతో కలిసి ఆందోళనలు నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతులు అందజేయాలని సూచించారు. తొలగించిన వారందరికీ మళ్లీ పించన్లు వచ్చేలా పోరాడాలన్నారు.

ఒక్క పించన్ తొలగించినా సహించేది లేదని, వృద్దుల నుంచి లంచాల రూపంలో 500 వసూళ్లు చేస్తే సహించేది లేదన్నారు చంద్రబాబు. వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని ఆ పార్టీ ఎంపీనే అంగీకరించారని చంద్రబాబు అన్నారు. వాలంటీర్ల అక్రమ వసూళ్లను అడ్డుకోవాలని టీడీపీ వర్గాలకు పిలుపునిచ్చారు. తమ హయాంలో 54 లక్షల మందికి పించన్లు ఇచ్చామని, పెన్షన్ మొత్తాన్ని 200 రూపాయల నుంచి 2 వేల రూపాయలకు పెంచామని చంద్రబాబు గుర్తు చేశారు.

బతికున్నవాళ్లను చనిపోయినట్లు చూపడం, లక్షలాది పించన్లు తొలగించడం అమానుషమన్నారు. వైసీపీ లీడర్లు దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నించినవారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని, ఏపీ ప్రస్తుతం భయం గుప్పిట్లో బతుకుతోందని చంద్రబాబు అంటున్నారు.

Published On - 1:21 pm, Thu, 6 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu