జగన్ అంతు చూసే దాకా నిద్రపోను: బాబు భీషణ ప్రతిఙ్ఞ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ అంతు చూసే దాకా నిద్రపోనని భీషణ ప్రతిఙ్ఞ చేశారు. అమరావతి ఏరియాలో రాజధాని కోసం కొనసాగుతున్న ఆందోళన యాభై రోజులకు చేరిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం తుళ్ళూరు ప్రాంతంలో పర్యటించి, ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. ‘‘జగన్ ఓ దుర్మార్గుడు.. ఒక రూపాయి సంపాదించడం చేతకాదు.. జగన్ అంతు చూసే వరకు నిద్రపోను… వైసిపి ఓ చెత్త పార్టీ.. గాలికి వచ్చారు […]

జగన్ అంతు చూసే దాకా నిద్రపోను: బాబు భీషణ ప్రతిఙ్ఞ

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ అంతు చూసే దాకా నిద్రపోనని భీషణ ప్రతిఙ్ఞ చేశారు. అమరావతి ఏరియాలో రాజధాని కోసం కొనసాగుతున్న ఆందోళన యాభై రోజులకు చేరిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం తుళ్ళూరు ప్రాంతంలో పర్యటించి, ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు.

‘‘జగన్ ఓ దుర్మార్గుడు.. ఒక రూపాయి సంపాదించడం చేతకాదు.. జగన్ అంతు చూసే వరకు నిద్రపోను… వైసిపి ఓ చెత్త పార్టీ.. గాలికి వచ్చారు గాలికే పోతారు…’’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మహిళలు కన్నీళ్లు పెట్టుకోకుండా.. వీరనారిమణుల్లా ఉద్యమించాలని చంద్రబాబు పిలుపినిచ్చారు. రాజధాని రైతులు ఎవరు సిఎం దగ్గరకు వెళ్లలేదు కడప నుంచి పెయిడ్ అర్టిస్టులను తీసుకోచ్చారని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతి రాజధానిపై సీఎం జగన్ ఎక్కడ చర్చ పెట్టిన తాము సిద్దమని ఆయన సవాల్ చేశారు. సీఎం జగన్ సైకో, ఉన్మాది.. అంటూ ఏమనాలో అర్ధం కావడం లేదన్నారు బాబు. తన రాజకీయ చరిత్రలో 9 నెలల కాలంలోనే ఇంతగా అప్రతిష్టపాలయిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని, రాజధానిపై జగన్‌కు సరైన ఆలోచనలేదని, అవగాహన అంతకన్నా లేదని చంద్రబాబు ఆరోపించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu