పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

ప్రచారంలో శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణలో అకాలీదళ్ కార్యకర్త ఒకరు మృతి చెందారు.

పంజాబ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 10, 2021 | 10:45 AM

Moga municipal election : ఫ పంజాబ్‌ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 14న మున్నిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరోవైపు ,ఎన్నికల ప్రచారం పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా ప్రచారంలో శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపధ్యంలో చెలరేగిన ఘర్షణలో అకాలీదళ్ కార్యకర్త ఒకరు మృతి చెందారు. మరో కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడిని లూధియానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మోగాలోని 9వ వార్డులో కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తలు పోటా పోటీ ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటచేసుకుని గొడవకు దారితీసింది. దీంతో వార్డులో అకాలీదళ్ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వివాదం మరింత ముదిరి అకాలీదళ్ కార్యకర్తపై దాడి చేశారు. దీంతో ఆతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో కార్యకర్త కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు పార్టీల కార్యకర్తల వాహనాలు కొన్ని ధ్వంసమయ్యాయి. అలాగే ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల ఫోకస్.. ఈనెల 23న నడ్డా పర్యటన