కిమ్ ఆరోగ్యం మరీ విషమం కాదట ! దక్షిణ కొరియా

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం మరీ అంత విషమంగా లేదని దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిమ్ కి కార్డియో వాస్క్యులర్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన హెల్త్ ఆందోళనకరంగా మారిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో..

కిమ్ ఆరోగ్యం మరీ విషమం కాదట ! దక్షిణ కొరియా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 21, 2020 | 12:48 PM

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం మరీ అంత విషమంగా లేదని దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కిమ్ కి కార్డియో వాస్క్యులర్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన హెల్త్ ఆందోళనకరంగా మారిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇద్దరు అధికారుల నుంచి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ.. సౌత్ కొరియా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సర్జరీ తరువాత ఆయన చికిత్స పొందుతున్నారని, అంతే తప్ప ఆయన ఆరోగ్యంపై వస్తున్న కథనాలు నిజం కావని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 12 న కిమ్ కి సర్జరీ జరిగిన అనంతరం హ్యాంగ్ శాన్ లోని మౌంట్ కుమ్ గాంగ్ రిసార్ట్ లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని అజ్ఞాత వర్గాలకు తెలియజేసినట్టు సియోల్ లోని ఓ డైలీ తెలిపింది. కిమ్ హెల్త్ చాలా డేంజర్ లో ఉందని సీఎన్ ఎన్ పేర్కొంది. కానీ మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఏప్రిల్ 12 న ఆయన ఎయిర్ బేస్ ని విజిట్ చేసి.. ఫైటర్ జెట్ల విన్యాసాన్ని చూశాడని నార్త్ కొరియా మీడియా తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల అనంతరం సైనిక విన్యాసాల్లో భాగంగా సముద్రంలోకి స్వల్ప దూర నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణులను ప్రయోగించారని, అలాగే సుఖోయ్ జెట్ విమానాలు ఆకాశ మార్గం నుంచి భూతలానికి మిసైల్స్ ని ‘పేల్చాయని’,, ఈ డ్రిల్స్ అన్నింటినీ కిమ్ పర్యవేక్షించాడని కూడా ఈ మీడియా వివరించింది. ఇలా పరస్పర విరుధ్ధ కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..