రెండు రాష్ట్రాల రవాణ శాఖ మంత్రుల కీలక భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రవాణా శాఖ మంత్రులు సోమవారం సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుపుటకు ఉన్న ప్రతిష్టంబన వీరి భేటీతో తొలిగిపోనుందని అనుకుంటున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల రవాణా శాఖ మంత్రులు సోమవారం సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుపుటకు ఉన్న ప్రతిష్టంబన వీరి భేటీతో తొలిగిపోనుందని అనుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈ నెల 14న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికికి ఇద్దరు మంత్రులు, ఆర్టీసీ ఎండీలు, సంబంధిత అధికారులు హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణా నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. ఎలాగైనా ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు చర్చించనున్నారు.
కాగా కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇటీవల లాక్‌డౌన్ ఎత్తివేయడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు.
దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ ఆధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి.