కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో అధిష్టానం కీలక మార్పులు చేసింది. వర్కింగ్‌ కమిటీ నుంచి పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికారు. జనరల్‌ సెక్రటరీ పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ను తొలగించారు.

కాంగ్రెస్ పార్టీలో భారీ ప్రక్షాళన
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 9:41 AM

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలైంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో అధిష్టానం కీలక మార్పులు చేసింది. వర్కింగ్‌ కమిటీ నుంచి పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికారు. జనరల్‌ సెక్రటరీ పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ను తొలగించారు. యూపీ ఇంచార్జ్‌గా ప్రియాంకాగాంధీకి కీలక బాధ్యతలు అప్పగించారు.

కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ నుంచి ఆజాద్‌తో పాటు అంబికాసోని, మల్లిఖార్జున్‌ ఖర్గే, మోతిలాల్‌ వోరాను కూడా తొలగించారు. సీడబ్ల్యూసీలో సోనియా సహా 22 మంది ఉంటారు. 26 మంది శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు.

తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇంచార్జులను కూడా మార్చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌గా మాణికం ఠాకూర్‌ను నియమించారు. కుంతియాను ఇంచార్జ్‌ పదవి నుంచి తొలగించారు. ఏపీ ఇంచార్జ్‌గా ఉమేన్‌ చాందీని నియమించారు.

ఉత్తరప్రదేశ్‌ కు ప్రియాంకగాంధీ, తమిళనాడు ఇంచార్జ్‌గా దినేష్‌ గుండూరావు, మహారాష్ట్ర ఇంచార్జ్‌గా హెచ్‌కే పాటిల్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ ఇంచార్జ్‌గా మనీష్‌ ఛత్ర, పశ్చిమబెంగాల్‌ ఇంచార్జ్‌గా జితిన్‌ ప్రసాద, జమ్ముకశ్మీర్‌ ఇంచార్జ్‌గా రజనీ పాటిల్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఇంచార్జ్‌గా రాజీవ్‌శుక్లాలను నియమించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలాను కర్నాటక ఇంచార్జ్‌గా కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీతోపాటు సెంట్రల్‌ ఎన్నికల కమిటీని కూడా పునర్‌ వ్యవస్థీకరించారు. శశిథరూర్‌, కపిల్‌ సిబాల్‌ లాంటి నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదు. పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని లేఖ రాసిన నేతలకు అధిష్టానం షాకిచ్చింది.

ఆరుగురు సభ్యులతో అధిష్టానం కమిటీని కూడా నియమించింది. అహ్మద్‌ పటేల్‌, ఏకే ఆంటోని, కేసీ వేణుగోపాల్‌, సూర్జేవాలా, ముకుల్‌ వాస్నిక్‌, అంబికాసోని ఇందులో సభ్యులుగా ఉంటారు. దీంతో గత కొంతకాలంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం భారీ మార్పులే చేసింది.

ఆగస్టు 24న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలకు అనుగుణంగానే సంస్థాగత ప్రక్షాళలకు సోనియా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.