బ్రేకింగ్: సీఏఏతో ముస్లింలకు భయం లేదు

ఇటీవల సవరించిన పౌరసత్వ చట్టంపై ముస్లిం వర్గాలకు ఏమాత్రం ఆందోళన అవసరం లేదని, నిజమైన భారతీయులెవరూ పౌరసత్వం కోల్పోరని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. దీనిపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఉచ్చులో ముస్లిం మైనారిటీలు చిక్కుకోవద్దని కోరారు. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌ దేశాలలో మైనారిటీలుగా వుంటూ.. అక్కడ చిత్రహింసలు పడుతున్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు భారత దేశంలో ఆశ్రయమవ్వడమే సీఏఏ ఉద్దేశమని చెప్పారు. సీఏఏతో దేశంలో వున్న ఏ […]

బ్రేకింగ్: సీఏఏతో ముస్లింలకు భయం లేదు
Follow us

|

Updated on: Jan 16, 2020 | 4:21 PM

ఇటీవల సవరించిన పౌరసత్వ చట్టంపై ముస్లిం వర్గాలకు ఏమాత్రం ఆందోళన అవసరం లేదని, నిజమైన భారతీయులెవరూ పౌరసత్వం కోల్పోరని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్. దీనిపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఉచ్చులో ముస్లిం మైనారిటీలు చిక్కుకోవద్దని కోరారు. పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌ దేశాలలో మైనారిటీలుగా వుంటూ.. అక్కడ చిత్రహింసలు పడుతున్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు భారత దేశంలో ఆశ్రయమవ్వడమే సీఏఏ ఉద్దేశమని చెప్పారు.

సీఏఏతో దేశంలో వున్న ఏ మైనారిటీ వర్గానికి నష్టం లేదని క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్. బీజేపీ-జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో సీఏఏపై విలేకరులు సంధించిన ప్రశ్నలకు పవన్ కల్యాణ్ క్లారిటీతో సమాధానమిచ్చారు. దేశ విభజన తర్వాత ఆ మూడు దేశాల్లో వుండిపోయిన హిందువులు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు అక్కడ ఎలాంటి వేధింపులకు గురవుతున్నారో.. ఎలా మత మార్పిడులకు గురవుతున్నారో చాలా మంది మేధావులు బుక్స్ రాశారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

అలా వేధింపులకు గురవుతున్న వారికి మనదేశం ఆశ్రయం కల్పిస్తే ఎవరికి నష్టమని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. భారతీయ సనాతన ధర్మంలోనే అన్ని మతాలను సమానంగా చూసే విధానం వుందని అన్నారాయన. ఎవరినీ వేరుగా, వివక్షతో చూడడం భారతీయులకు అలవాటు లేదని, సీఏఏ వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు పవన్ కల్యాణ్.