Pawan Tirupati campaign : తిరుపతిలో పవన్ ప్రచార తేదీ ఖరారు, బీజేపీ కీలక నేతలతో ఏడుకొండల నగరంలో పాదయాత్ర.!
Pawan kalyan Tirupati by poll election campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి..
Pawan kalyan Tirupati by poll election campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి జనసేనాని ఎలక్షన్ క్యాంపెయిన్ షురూ కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విశాఖ ఎంపీ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతిస్తూ జనసేన పార్టీ పోటీ నుంచి విరమించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని రత్నప్రభకు మద్దతుగా పవన్ ఏప్రిల్ 3వ తేదీన తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ రేణిగుంట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఏప్రిల్ 3న పవన్ తిరుపతిలో పాదయాత్ర నిర్వహిస్తారని.. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకూ పవన్ కళ్యాణ్ పాదయాత్ర సాగుతుందని జనసేన సదరు ప్రకటనలో పవన్ తిరుపతి పర్యటన వివరాలు వెల్లడించింది. బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ పాదయాత్ర నిర్వహిస్తారని.. 3వ తేదీన పాదయాత్ర తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు శంకరంబాడి సర్కిల్‌లో బహిరంగ సభలో పాల్గొంటారని జనసేన పేర్కొంది. కాగా, ఈ పాదయాత్రలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీ కీలక నేతలు, అభ్యర్థిని రత్నప్రభతోపాటు పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రచారానికి రావలసిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 3న తిరుపతిలో శ్రీ @PawanKalyan గారు ఎన్నికల ప్రచారం pic.twitter.com/RLOgk3U1UK
— JanaSena Party (@JanaSenaParty) March 30, 2021
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి @Ratnaprabha_IAS కొద్దిసేపటి క్రితం జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని హైదరాబాద్ లో కలిశారు pic.twitter.com/IbHuhJtYjr
— JanaSena Party (@JanaSenaParty) March 26, 2021
ఈ సమావేశంలో పీఏసీచైర్మన్ శ్రీ @mnadendla గారు,బిజెపిజాతీయప్రధాన కార్యదర్శి శ్రీమతి @PurandeswariBJP గారు,బిజెపిరాష్ట్ర అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు,బిజెపిరాష్ట్ర వ్యవహారాల కోఇన్చార్జి శ్రీ @Sunil_Deodhar గారు,బిజెపిరాష్ట్ర జనరల్ సెక్రెటరీశ్రీ @BJPMadhukarAP గారుపాల్గొన్నారు pic.twitter.com/Ox0PtiMYd1
— JanaSena Party (@JanaSenaParty) March 26, 2021