AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో కుట్రకు ప్లాన్ చేశారా? ఐబీ హెచ్చరికలు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయా? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీ దాడులు జరిపే అవకాశాలున్నట్టుగా బలమైన సమాచారం ఉంది. దీంతో ఎక్కడిక్కడకే భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఇప్పటికే జైషే మహ్మద్ సంస్ధకు ఏడుగురు సభ్యుల ఉగ్రవాదుల బృందం భారత్‌లో ప్రవేశించి భారీగా ప్రాణం, ఆస్తి నష్టం కలిగించేలా ప్లాన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో పాక్ రకరకాలుగా ప్రవర్తించడం, […]

మరో కుట్రకు ప్లాన్ చేశారా? ఐబీ హెచ్చరికలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2019 | 2:56 PM

Share

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయా? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీ దాడులు జరిపే అవకాశాలున్నట్టుగా బలమైన సమాచారం ఉంది. దీంతో ఎక్కడిక్కడకే భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఇప్పటికే జైషే మహ్మద్ సంస్ధకు ఏడుగురు సభ్యుల ఉగ్రవాదుల బృందం భారత్‌లో ప్రవేశించి భారీగా ప్రాణం, ఆస్తి నష్టం కలిగించేలా ప్లాన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో పాక్ రకరకాలుగా ప్రవర్తించడం, అంతర్జాతీయ సమాజం పాక్‌ను ఒంటరిని చేయడంతో ఏం చేయాలో అర్ధం కాక ఇలాంటి విద్వేష పూరిత దాడులకు పాల్పడాలని కుట్రపన్నినట్టుగా నిఘావర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు బినిహల్, పిర్ పంజాల్ పర్వాతాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు.

మరోవైపు ఆదివారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేస్తూ, కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొన్నారు. ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఇమ్రాన్. కశ్మీర్‌లో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశాలున్నాయని, ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో మరో ఘాతుకానికి తెగబడేందుకు పాక్ ప్రణాళిక రచిస్తున్నట్టుగా భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు జమ్ము కశ్మీర్ సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైనికులు మోహరించారు. ప్రజలెవ్వరూ వీధుల్లోకి రావొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆదివారం వీధుల్లోకి జనం రాకపోవడంతో భారీగా నష్టపోయినట్టు వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
సెంచరీతో చెలరేగిన గంటల్లోనే ఆసుపత్రి బెడ్ పై జైస్వాల్
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్.. రాత్రి వరకు తిరిగి రాలేదు..
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
బరువు తగ్గొచ్చని.. వీటిని ఎడాపెడా తినే అలవాటు మీకూ ఉందా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మొలకలు.. చికెన్.. వేటిల్లో అధిక ప్రొటీన్‌ ఉంటుందో తెలుసా?
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
మీ కురులు రాలిపోవడానికి ఈ ఆహారాలూ కారణమే.. తినకపోవడమే మంచిది!
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
2026లో ఊహించని సంచలనాలు.. వణుకు పుట్టిస్తున్న బాబా వంగా అంచనాలు
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు ఇవే.. ఎందుకంటే..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
T20 World Cup 2026: ఛీ కొట్టిన ప్లేయరే బీసీసీకి దిక్కయ్యాడుగా..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కుక్కలను పెంచుకోవచ్చా..?
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..
చివరి రోజుల్లో నన్ను పిలిచి అలా చేశాడు.. బ్రహ్మానందం కన్నీళ్లు..