భారత్‌ను భయపెడుతున్న నిరుద్యోగం

దిల్లీ : భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల(ఫిబ్రవరి -2019)లో దీని రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానామీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లలో సర్వే చేసి […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:59 pm, Wed, 6 March 19
భారత్‌ను భయపెడుతున్న నిరుద్యోగం

దిల్లీ : భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల(ఫిబ్రవరి -2019)లో దీని రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానామీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది ఇళ్లలో సర్వే చేసి ఈ నివేదికను సీఎంఐఈ వెల్లడించింది.

ఉద్యోగార్థుల సంఖ్య తగ్గినప్పటికీ.. నిరుద్యోగ రేటు పెరిగిందని ముంబయికి చెందిన ఓ సంస్థకు హెడ్‌ అయిన మహేశ్‌ వ్యాస్‌ తెలిపారు. ఉద్యోగం చేస్తున్న వారి సంఖ్య ఫిబ్రవరిలో 400 మిలియన్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇది గతేడాది 406 మిలియన్లుగా ఉందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత 2018లో దాదాపు 1.10కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. ఈ గణాంకాలు త్వరలో ఎన్నికలకు సిద్ధం కానున్న ప్రధాని నరేంద్రమోదీకి నిరాశ కలిగించే విధంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.