మూన్‌పై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌

జెరూసలెం : చంద్రునిపై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీని తీసి భూమికి పంపించింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల(37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను అది క్లిక్‌మనిపించింది. ఈ సెల్ఫీలో రోబోటిక్‌ లాండర్‌తోపాటు వెనుకభాగంలో వెలిగిపోతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది. బేర్‌షీట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తోందని మిషన్‌ బృంద సభ్యులు ఆ ఫొటోను పోస్టు చేస్తూ […]

మూన్‌పై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌
Follow us

|

Updated on: Mar 06, 2019 | 2:57 PM

జెరూసలెం : చంద్రునిపై అడుగుపెట్టబోతున్న తొలి ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తన మొదటి సెల్ఫీని తీసి భూమికి పంపించింది. భూమికి దాదాపు 20 వేల మైళ్ల(37 వేల కిలోమీటర్లు) దూరం నుంచి ఈ అద్భుతమైన ఫొటోను అది క్లిక్‌మనిపించింది. ఈ సెల్ఫీలో రోబోటిక్‌ లాండర్‌తోపాటు వెనుకభాగంలో వెలిగిపోతున్న భూమి స్పష్టంగా కనిపిస్తోంది.

బేర్‌షీట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో తీసిన ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తోందని మిషన్‌ బృంద సభ్యులు ఆ ఫొటోను పోస్టు చేస్తూ తెలిపారు. ఈ ఫొటోలో స్పేస్‌క్రాఫ్ట్‌పై ఇజ్రాయెల్‌ జాతీయ పతాకంతోపాటు.. ‘చిన్నదేశం.. పెద్ద కలలు’ అని రాసున్న సందేశం కూడా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్‌ లాండర్‌ను ఫ్లోరిడాలోని కేఫ్‌ కానవెరాల్‌ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఏప్రిల్‌ 11న చంద్రునిపై దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా పంపించారు. ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై దిగాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఈ దేశం కూడా చేరనుంది.

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?