ఆశ్చర్యపరుస్తోన్న 2, 700 ఏళ్ల క్రితం నాటి టాటూ కిట్

ప్రపంచంలోనే అతి పురాతన టాటూ కిట్ బయటపడింది. 2,700 సంవత్సరాల క్రితం నాటిది కావడం విశేషం. బహుశా ఇది టాటూ వాడకం మొదలైన తొలినాళ్ల నాటిదై ఉండొచ్చు. మనుషుల ఎముకల నుంచి దీన్ని తయారు చేశారు. న్యూజీలాండ్ దేశం ఉత్తర ప్రాంతంలోని టోంగా ప్రాంతంలో ఈ కిట్ లభ్యమైంది. ఈ టోంగా ప్రాంతం ఫిజికి సమీపంలో ఉంటుంది. కార్బన్ డేటింగ్ విధానం ద్వారా ఈ టాటూ కిట్ 2,700 ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన […]

ఆశ్చర్యపరుస్తోన్న 2, 700 ఏళ్ల క్రితం నాటి టాటూ కిట్
Vijay K

|

Mar 06, 2019 | 12:53 PM

ప్రపంచంలోనే అతి పురాతన టాటూ కిట్ బయటపడింది. 2,700 సంవత్సరాల క్రితం నాటిది కావడం విశేషం. బహుశా ఇది టాటూ వాడకం మొదలైన తొలినాళ్ల నాటిదై ఉండొచ్చు. మనుషుల ఎముకల నుంచి దీన్ని తయారు చేశారు. న్యూజీలాండ్ దేశం ఉత్తర ప్రాంతంలోని టోంగా ప్రాంతంలో ఈ కిట్ లభ్యమైంది. ఈ టోంగా ప్రాంతం ఫిజికి సమీపంలో ఉంటుంది.

కార్బన్ డేటింగ్ విధానం ద్వారా ఈ టాటూ కిట్ 2,700 ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫ్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలో రేడియో కార్బన్ టెక్నిక్‌ను వినియోగించి ఈ కిట్ వయసును అంచనా వేశారు.

ఈ కిట్‌లో ఏముంది? ఈ కిట్‌లో నాలుగు రకాలైన పనిముట్లు ఉన్నాయి. ఈ నాలుగు కూడా ఎముకలతో తయారు చేసినవి. రెండు భారీ సముద్ర పక్షి ఎముకల నుంచి కాగా మరో రెండు పెద్ద జంతువుల నుంచి నుంచి తయారు చేయబడ్డాయి.

ఆ కాలంలో టోంగా ప్రాంతంలో మనుషలను మించిన జంతువులు లేకపోవడంతో అవి మనుషుల ఎముకల నుంచే తయారు చేసినట్టుగా భావిస్తున్నట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

ఈ నాలుగు టాటూ పనిముట్లలో ఒకటి దువ్వెన మాదిరిగా పళ్లు కలిగి ఉండి అవి చాలా షార్ప్‌గా ఉన్నాయి. ఇంకొకటి సుత్తి మాదిరిగా మందంగా ఉంది. మరొకటి ఇరిగిపోయి రిపేర్ చేయబడినట్టుగా ఉంది. ఇలా ఇరిగిపోవడం వల్లనే ఈ కిట్‌ను పక్కన పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.

వీటితో పాటు టాటూ వేసేందుకు వాడే ప్రత్యేకమైన ఇంక్, దాని కోసం ఒక పాత్ర, వీటన్నింటినీ ఒక పెద్ద సైజు పెట్టెలాంటి దానిలో పెట్టి ఉంచబడింది. అయితే టాటూ వేయడం 5000 ఏళ్ల క్రితమే ఈజిప్ట్, ఇటలీ ప్రాంతాల్లో మొదలైనట్టు చెబుతారు. అయితే అప్పటి టాటూ కిట్‌లు ఎలా ఉంటాయనేది మాత్రం ఎవరికీ తెలియదు.

ఇలా టాటూ వేయించుకోవడాన్ని అప్పటి నుంచే ప్రజలు బాగా ఇష్టపడేవారు. కానీ క్రిస్టియన్ మిషనరీలు ఈ టాటూ విధానాన్ని నిషేధించడంతో చాలా మంది ఇతర దీవులకు వెళ్లి మరీ వేయించుకునేవారు. ఈ కిట్ మొత్తం ఒక టాటూ కళాకారుడిది. ఇలా ఎముకులతో తయారు చేసిన పరికరాలతో టాటూ వేయడం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu