దేశంలోనే తొలి ‘కిసాన్ రైలు’ ప్రారంభం..

రైతుల ప్ర‌యోజ‌నం కోసం దేశంలో ప్రవేశ‌పెట్టిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్, రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ శుక్ర‌వారం ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. ముంబాయిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో తొలి కిసాన్ రైలును..

దేశంలోనే తొలి 'కిసాన్ రైలు' ప్రారంభం..

రైతుల ప్ర‌యోజ‌నం కోసం దేశంలో ప్రవేశ‌పెట్టిన తొలి కిసాన్ రైలును కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్, రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ శుక్ర‌వారం ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. ముంబాయిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో తొలి కిసాన్ రైలును న‌రేంద్ర సింగ్ తోమ‌ర్, పియూష్ గోయ‌ల్ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. మ‌హారాష్ట్ర‌లోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానాపూర్ వ‌ర‌కు న‌డిచే తొలి కిసాన్ రైలు ఇదే. వారానికి రెండు సార్లు ఈ కిసాన్ రైలు న‌డ‌వ‌నుంది. కాగా ప్ర‌తీ శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు దేవ్లాలీలో బ‌య‌లు దేరి.. మ‌రుస‌టి రోజు సాయంత్రం 7 గంట‌ల‌కు దానాపూర్ చేరుతుంద‌ని మంత్రి ఎత‌లిపారు. అలాగే ప్ర‌తీ ఆదివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు దానాపూర్‌లో బ‌య‌లుదేరి సోమ‌వారం సాయంత్రం 8 గంట‌ల‌కు దేవ్లాలీ చేరుకుంటుంది.

అలాగే త్వ‌ర‌గా పాడ‌య్యే అవ‌కాశ‌మున్న పాలు, కూర‌గాయ‌లు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను చాలా వేగంగా, త‌క్కువ వ్య‌యంతో ర‌వాణా చేస్తుంది. కేంద్రీయ రైల్వే ప‌రిధిలోని భుశావ‌ల్ డివిజ‌న్ స‌హా నాసిక్ ప‌రిస‌ర ప్రాంతాల్లో కూర‌గాయ‌లు, పండ్లు, పూలు అత్య‌ధిక విస్తీర్ణంలో సాగ‌వుతుండ‌గా.. వాటిని పట్నా, అల‌హాబాద్‌, క‌త్ని, స‌త్నా వంటి ప్రాంతాల‌కు ర‌వాణా చేస్తూంటారు. ఆయా ప్రాంతాల రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డాల‌నే ల‌క్ష్యంతో తొలి కిసాన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు నాసిక్ నుంచి బ‌క్స‌ర్ మ‌ధ్య అనేక స్టేష‌న్ల‌లో ఆగ‌నుంది.

Read More:

మ‌రో ప్ర‌ముఖ న‌టి సూసైడ్, క‌ల‌క‌లం రేపుతోన్న ఆత్మ‌హ‌త్య‌లు!

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం

మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్‌పై అస‌భ్య‌క‌ర పోస్ట్‌, వ్య‌క్తి అరెస్ట్‌

Click on your DTH Provider to Add TV9 Telugu