AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత వీడియో షేర్ చేసి విమర్శల పాలైన పాక్

పాకిస్థాన్‌ వక్రబుద్ధి మరోసారి సోషల్ మీడియా వేదికగా బయటపడింది. భారత్‌పై బురద జల్లే ప్రయత్నంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాకిస్థాన్. ఆ వీడియో పాతది అని తేల్చేయడంతో మరోసారి విమర్శల పాలైంది. భారత్‌కు చెందిన ఓ సబ్‌మెరైన్ తమ సముద్రజలాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిందని, దాన్ని తాము తిప్పికొట్టామని చెబుతూ 50సెకన్లు కలిగిన ఓ వీడియోను సోమవారం పాక్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని బలపరుస్తూ ఆ దేశానికి చెందిన […]

పాత వీడియో షేర్ చేసి విమర్శల పాలైన పాక్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 4:49 PM

Share

పాకిస్థాన్‌ వక్రబుద్ధి మరోసారి సోషల్ మీడియా వేదికగా బయటపడింది. భారత్‌పై బురద జల్లే ప్రయత్నంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాకిస్థాన్. ఆ వీడియో పాతది అని తేల్చేయడంతో మరోసారి విమర్శల పాలైంది.

భారత్‌కు చెందిన ఓ సబ్‌మెరైన్ తమ సముద్రజలాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించిందని, దాన్ని తాము తిప్పికొట్టామని చెబుతూ 50సెకన్లు కలిగిన ఓ వీడియోను సోమవారం పాక్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని బలపరుస్తూ ఆ దేశానికి చెందిన ఓ నేవీ అధికారి.. ‘‘పాకిస్థాన్ నేవీ అధికారులు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి భారత సబ్‌మెరైన్‌ను తమ జలాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. శాంతి ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సబ్‌మెరైన్‌ను తాము ఏమీ చేయలేదు. దీన్ని చూసైనా భారత్ బుద్దిని మార్చుకొని శాంతి మార్గంలో పయనించాలి’’ అంటూ పేర్కొన్నారు.

అయితే దీనిపై స్పందించిన భారత అధికారులు అది పాత వీడియో అని తేల్చేశారు. అబద్ధపు ఆరోపణలు చేసి పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించిందంటూ భారత అధికారులు మండిపడ్డారు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాక్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వీడియోలను వేలల్లో తయారు చేసి పాక్‌పై తాము కూడా ఆరోపణలు చేయగలం అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. కాగా పాకిస్థాన్ షేర్ చేసిన ఆ వీడియో 2016 సంవత్సరంలోనిది.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా