త్వరలో వాడుకలోకి రూ.20 నాణెం

ఢిల్లీ: భారత కరెన్సీ వ్యవస్థలోకి మరో కొత్త నాణెం ఎంట్రీ ఇవ్యబోతుంది. త్వరలో రూ. 20 నాణేన్ని విడుదల చేయనున్నట్లు భారత ఆర్థికశాఖ ప్రకటించింది. ఈ మేరకు నాణెం నమూనాను వెల్లడిస్తూ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 10 నాణెం మాదిరిగా కాకుండా రూ. 20 నాణేన్ని కాస్త కొత్తగా డిజైన్ చేస్తున్నారు. రూ. 10 నాణెం 27 మిల్లీమీటర్ల వ్యాసంతో గుండ్రంగా ఉంటుంది. అయితే రూ. 20 నాణెంకు మాత్రం […]

త్వరలో వాడుకలోకి రూ.20 నాణెం
Ram Naramaneni

|

Mar 07, 2019 | 12:44 PM

ఢిల్లీ: భారత కరెన్సీ వ్యవస్థలోకి మరో కొత్త నాణెం ఎంట్రీ ఇవ్యబోతుంది. త్వరలో రూ. 20 నాణేన్ని విడుదల చేయనున్నట్లు భారత ఆర్థికశాఖ ప్రకటించింది. ఈ మేరకు నాణెం నమూనాను వెల్లడిస్తూ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 10 నాణెం మాదిరిగా కాకుండా రూ. 20 నాణేన్ని కాస్త కొత్తగా డిజైన్ చేస్తున్నారు. రూ. 10 నాణెం 27 మిల్లీమీటర్ల వ్యాసంతో గుండ్రంగా ఉంటుంది. అయితే రూ. 20 నాణెంకు మాత్రం రౌండ్‌గా కాకుండా పాత రూ.2 నాణెంలా చూట్టారా 12 అంచులు ఉంటాయని ఆర్థికశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంతేగాక.. కొత్త నాణెంపై చివర్లలో ఎలాంటి డిజైన్‌ ఉండదని తెలిపింది.

అయితే రూ. 10 నాణెంలాగే.. రూ. 20 నాణెంలోనూ రెండు రింగ్స్‌ ఉంటాయి. వెలుపలి రింగ్‌ను 65శాతం రాగి, 15శాతం జింక్‌, 20శాతం నికెల్‌తో తయారుచేస్తుండగా.. లోపలి రింగ్‌ను 75శాతం కాపర్‌, 20శాతం జింక్‌, 5శాతం నికెల్‌తో రూపొందిస్తున్నారు. అయితే నాణెం ఎప్పుడు విడుదల చేస్తారన్నది మాత్రం ఆర్థికశాఖ ఇంకా వెల్లడించలేదు.

2009 మార్చిలో రూ. 10 నాణేన్ని చలామణిలోకి తెచ్చారు. ఆ తర్వాత ఈ నాణెం రూపురేఖల్లో మార్పులు చేస్తూ మొత్తం 14 డిజైన్లలో విడుదల చేశారు. అయితే ఆ మధ్య రూ. 10 నాణేలు చెల్లవంటూ వదంతులు వ్యాపించాయి. వీటిని గతేడాది ఆర్‌బీఐ కొట్టిపారేసింది. చలామణిలో ఉన్న 14 రకాల రూ.10 నాణేలు చెల్లుతాయని స్పష్టం చేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu