బ్రేకింగ్ః కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనాను జయించారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలోని ఆయన కొన్ని రోజులుగా కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో నెగిటివ్ రిపోర్టు..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా నెగిటివ్ వచ్చింది. తాజాగా చేసిన రిపోర్టుల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. ”ఈ రోజు నాకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. డాక్టర్ల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లోనే ఉంటాను. అలాగే నాకు వైద్యం చేసిన డాక్టర్లకు, పారా మెడికల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు”.. అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
ఆగష్టు 2వ తేదీన అమిత్ షా కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలోని ఆయన కొన్ని రోజులుగా కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. శుక్రవారం ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో నెగిటివ్ రిపోర్టు వచ్చింది. కాగా ఇంకా కొన్నిరోజులు హోమ్ క్వారంటైన్‌లో ఒంటరిగా ఉంటానని అమిత్ షాలో ట్వీట్‌లో పేర్కొన్నారు.
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ। डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।
— Amit Shah (@AmitShah) August 14, 2020
Read More:
ఓటీటీల్లో నటించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అరవింద్