AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News లాక్‌డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం

కరోనా వైరస్ ప్రబలిన కీలక సమయంలో లాక్ డౌన్ ఆంక్షలను ఏకంగా ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Breaking News లాక్‌డౌన్ ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం
Rajesh Sharma
|

Updated on: May 20, 2020 | 2:58 PM

Share

AP high court bench severe comments on YCP MLAs for neglecting Lock down restrictions:  కరోనా వైరస్ ప్రబలిన కీలక సమయంలో లాక్ డౌన్ ఆంక్షలను ఏకంగా ప్రజా ప్రతినిధులే ఉల్లంఘించడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై సీబీఐ విచారణకు ఎందుకు అదేశించకూడదంటై హైకోర్టు ధర్మాసనం తీవ్రమైన కామెంట్లు చేసింది. లాక్ డౌన్ పాటించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు నిర్దిష్టమైన రూల్స్ అమలు చేయాలని చెబితే ప్రజా ప్రతినిధులుగా ఎమ్మెల్యేలే అమలు చేయకపోవడం ఏంటని ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయమూర్తులు అన్నారు.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తోపాటు ఎమ్మెల్యేలే మల్లాది విష్ణు, శ్రీదేవి తదితరులు మొత్తం ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ హైకోర్టులో వేర్వేరు ప్రజాప్రయోజనవ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై ఏపీ హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాలు నిర్దేశించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రజాప్రతినిధులే ఉల్లంఘించడమేంటని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ఇంటరక్షన్‌లో భాగంగానే ఎమ్మెల్యేలు అలా వ్యవహరించారని ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది సుమన్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు.

ప్రజా ప్రతినిధులైన వారే నిబంధనలు పాటించనవుడు, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొనపుడు సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదు అని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలను పాస్ చేసింది. దాంతో ప్రభుత్వం తరపున పూర్తి వివరాలు ధర్మాసనానికి నివేదించేందుకు అదనపు సమయం కోరారు అడ్వకేట్ జనరల్. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.