హార్దిక్ పటేల్‌కు షాక్.. ఎన్నికల్లో పోటీకి అనర్హుడు
గాంధీనగర్ : కాంగ్రెస్ యువనేత, పటీదార్ ఉద్యమ కారుడు హార్దిక్ పటేల్‌కు భారీ షాక్ తగిలింది. గతంలో ఓ దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఆయన.. ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ కేసులో శిక్షపై స్టే విధించాలన్న హార్దిక్ వినతిని గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. 2015లో ఎమ్మెల్యే రిషికేష్ […]
గాంధీనగర్ : కాంగ్రెస్ యువనేత, పటీదార్ ఉద్యమ కారుడు హార్దిక్ పటేల్‌కు భారీ షాక్ తగిలింది. గతంలో ఓ దాడి కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఆయన.. ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. ఈ కేసులో శిక్షపై స్టే విధించాలన్న హార్దిక్ వినతిని గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. 2015లో ఎమ్మెల్యే రిషికేష్ పటేల్ ఆఫీస్‌పై దాడి చేసిన కేసులో హార్దిక్ పటేల్‌కు విసానగర్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. దీనిపై స్టే విధించాలని హార్దిక్ పటేల్ కోరగా.. దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హార్దిక్‌పై 24 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, అందులో రెండు దేశ ద్రోహ కేసులు కూడా ఉన్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. బెయిల్‌పై ఉన్నా కూడా హార్దిక్ తరచూ ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నాడని స్పష్టం చేసింది. మార్చి 8న తనపై ఉన్న ఈ శిక్షను తొలగించాలని కోరుతూ హార్దిక్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హర్దిక్.. సూరత్‌లోని లాజ్‌పూర్ జైల్లో 9 నెలల శిక్ష అనుభవించడంతోపాటు ఆరు నెలలపాటు రాష్ట్ర బహిష్కరణ కూడా ఎదుర్కొన్నాడు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 4న నామినేషన్ల చివరి తేదీ. దీంతో ఆ కొద్ది సమయంలోనే హార్దిక్ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు హర్దిక్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తేనే.. ఎన్నికల్లో పోటీ చేయగలరు.