సిక్కుల ఊచకోత కేసుపై సిట్‌ దర్యాప్తు మరో రెండు నెలలు పొడిగింపు

న్యూఢిల్లీ : 1984 సిక్కుల ఊచకోతకు సంబంధించి 186 కేసులపై దర్యాప్తు పూర్తి చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కు మరో రెండు నెలల పాటు గడువిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. సిట్ వాదనను విన్న అనంతరం జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే, జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ప్రకటించింది. ఇప్పటికే యాభై శాతం దర్యాప్తు పూర్తయిందని.. మరో రెండు నెలలు గడువిస్తే విచారణ పూర్తవుతుందని న్యాయస్థానానికి […]

సిక్కుల ఊచకోత కేసుపై సిట్‌ దర్యాప్తు మరో రెండు నెలలు పొడిగింపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 29, 2019 | 7:23 PM

న్యూఢిల్లీ : 1984 సిక్కుల ఊచకోతకు సంబంధించి 186 కేసులపై దర్యాప్తు పూర్తి చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కు మరో రెండు నెలల పాటు గడువిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. సిట్ వాదనను విన్న అనంతరం జస్టిస్‌ ఎస్‌.ఏ.బాబ్డే, జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ప్రకటించింది. ఇప్పటికే యాభై శాతం దర్యాప్తు పూర్తయిందని.. మరో రెండు నెలలు గడువిస్తే విచారణ పూర్తవుతుందని న్యాయస్థానానికి సిట్ వెల్లడించింది. సిట్ వాదనను విన్న కోర్టు రెండు నెలల గడువుకు ఓకే చెప్పింది.

ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు గుర్లాద్‌ సింగ్‌ కహ్లాన్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పిటిషన్‌లో పేర్కొన్న 62 మంది పోలీసుల పాత్రపై కూడా విచారణ జరపమని సిట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత సంవత్సరం జనవరి 11న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌. ఎన్‌. దింగ్ర నేతృత్వంలో మాజీ ఐపీఎస్‌ అధికారి రాజ్‌దీప్‌ సింగ్‌తో పాటు మరో ఐపీఎస్‌ అధికారి అభిషేక్‌ దులార్‌తో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని.. ఆమె సెక్యూరిటీ సిబ్బందిగా ఉన్న ఇద్దరు సిక్కులు హత్య చేశారనే ఆరోపణతో.. రాజధాని ఢిల్లీతో పాటుగా దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సిక్కులపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కేవలం ఢిల్లీలోనే 2,733 మంది ప్రాణాలు కోల్పోయారు.