విమానాలకు గ్రీన్ సిగ్నల్.. షరతులివే!

విమానాలకు గ్రీన్ సిగ్నల్.. షరతులివే!

దేశంలో మెల్లిమెల్లిగా లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రైళ్ళ రాకపోకలకు విధించినట్లుగానే పలు షరతులను విమానయాన శాఖ విదించబోతోంది

Rajesh Sharma

|

May 12, 2020 | 7:05 PM

Breaking news: Green signal to domestic flights: దేశంలో మెల్లిమెల్లిగా లాక్ డౌన్ నిబంధనలకు సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే రైళ్ళ రాకపోకలకు విధించినట్లుగానే పలు షరతులను విమానయాన శాఖ విదించబోతోంది. వయసు, లగేజీ వంటి రెస్ట్రిక్షన్స్ పెడుతూ సివిల్ ఏవియేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మే 17వ తేదీ తర్వాత దేశీయ విమానాలకు అనుమతి లభించబోతున్న సంకేతాలు ఈ ఉత్తర్వులతో వెలువడినట్లయ్యింది.

విమానయాన సర్వీసుల పునఃప్రారంభానికి ముందు విమానయాన సంస్థలు, విమానాశ్రయ ఆపరేటర్లతో సహా అన్ని విమానయాన వాటాదారులకు సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాలు ఖరారు చేసింది. విమానయాన సంస్థలకు, ఎయిర్ పోర్టుల అథారిటీకి ఈ మేరకు నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశారు. మొదటి దశలో 80 ఏళ్ల పైబడిన వృద్దులకు విమానయాన ప్రయాణానికి అనుమతి లేదు. ప్రారంభ దశలో క్యాబిన్ సామానుకు అనుమతి ఇవ్వరు. కేవలం చెక్-ఇన్ సామాను (లగేజీ)కు అనుమతిస్తూ దాన్ని 20 కిలోలకు పరిమితం చేశారు. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ కలర్ ఉన్నవారినే విమానశ్రయాల్లోకి, విమాన ప్రయాణానికి అనుమతించాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ నిర్ణయించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu