AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan reaction క‌ృష్ణా నదీజలాల వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు

శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నం చేస్తోందంటూ తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు, చేస్తున్న ఫిర్యాదులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Jagan reaction క‌ృష్ణా నదీజలాల వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు
Rajesh Sharma
|

Updated on: May 12, 2020 | 7:58 PM

Share

శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను తరలించుకుపోవడానికి ఏపీ ప్రయత్నం చేస్తోందంటూ తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు, చేస్తున్న ఫిర్యాదులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల అక్రమ తరలింపునకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న కామెంట్లను జగన్ తీవ్రంగా అభ్యంతర పెట్టారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి ఎగువన మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను జగన్ సమర్థించుకున్నారు.

‘‘ ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి.. రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి.. రాష్ట్రానికి కేటాయించిన నీటినిమాత్రమే మేం వాడుకుంటాం.. కేటాయింపులను దాటి ఏ రాష్ట్రం కూడా అదనంగా నీటిని వాడుకునే అవకాశం కూడా ఉండదు.. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఈ నీటి కేటాయింపులు చేస్తుంది.. ఆ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదు.. ఏపీ హక్కుగా కేటాయించిన నీటిని తీసుకోవడానికి ఒక సదుపాయంగా మాత్రమే మేం పోతిరెడ్డిపాడు వద్ద కట్టుకుంటున్నాం..’’ అని జగన్ వ్యాఖ్యానించారు.

‘‘ శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది… ఈ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండడం మహాకష్టం.. ఆ పది రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది.. అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టం.. ఇక 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడునుంచి వెళ్లే నీళ్లు వేయి క్యూసెక్కుల మాత్రమే.. కొత్తగా కడుతున్న వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా 2 టన్నెల్స్‌ నుంచి వెళ్లేది గరిష్టంగా 9వేల క్యూసెక్కుల నీరు మాత్రమే.. అది కూడా శ్రీశైలంలో నీళ్లు 854 అడుగుల వద్ద ఉంటేనే ఆ మాత్రం నీళ్లైనా వెళ్తాయి.. ’’ అని ముఖ్యమంత్రి వివరించారు.

తెలంగాణ నీటి తరలింపు వివరాలు:

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో నీళ్లు 800 అడుగుల స్థాయిలో వున్నా కూడా నీటిని రోజుకు 2 టీఎంసీల మేర ( 23,148 క్యూసెక్కుల నీరు) నీటిని తెలంగాణ తరలించవచ్చని, ఇలా 90 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం తరలిస్తుందని జగన్ వివరించారు. ఇక కల్వకుర్తి … ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నీటిని రోజుకు 0.3 టీఎంసీల (3,500 క్యూసెక్కుల) నీటిని తీసుకెళ్లగలరని, ఇలా 40 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని, ఇదే 800 అడుగుల స్థాయిలో దిండి నుంచి రోజుకు 0.5 టీంఎసీలను (5,787 క్యూసెక్కులు) తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్లగలదని, అలా 30 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని జగన్ వివరించారు.