కరోనా టైంలో విమానం ప్రయాణం ఇలా ఉంది.. అనుభవాల్ని షేర్ చేసిన ఓ ప్రయాణికురాలు

ఫ్లైట్ ఎక్కేవారికి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ అన్నీ చెక్ చేసి.. కరోనా లక్షణాలు లేవని తెలిస్తేనే వారికి స్టాంప్ వేసి.. క్వారంటైన్‌కి పంపిస్తున్నారట. అలాగే అందుకు కావాల్సిన స్నాక్స్..

  • Tv9 Telugu
  • Publish Date - 11:36 am, Tue, 12 May 20
కరోనా టైంలో విమానం ప్రయాణం ఇలా ఉంది.. అనుభవాల్ని షేర్ చేసిన ఓ ప్రయాణికురాలు

ఇన్నాళ్లూ కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను.. ఇండియాకి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మేఘన అనే ప్రయాణికురాలు లండన్ నుంచి బెంగూళురు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విమాన ప్రయాణం గురించి పలు చెప్పుకొచ్చారు. ఇది వరకు ఈ ప్రయాణం రొటీన్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అలాకాదు. కరోనా టైమ్‌ కాబట్టి భౌతిక దూరం పాటిస్తూ ఫ్లైట్ ఎక్కారట. ఈ సందర్భంగా తనలాగ ఎవరైనా భారత్‌కు వస్తే.. తన అనుభవాలు వారికి పనికివస్తాయన్న ఉద్ధేశ్యంతో ఆమె పలు ట్వీట్స్ చేసింది.

– ఫ్లైట్ ఎక్కేవారికి బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ లెవల్స్ అన్నీ చెక్ చేసి.. కరోనా లక్షణాలు లేవని తెలిస్తేనే వారికి స్టాంప్ వేసి.. క్వారంటైన్‌కి పంపిస్తున్నారట. అలాగే అందుకు కావాల్సిన స్నాక్స్ కూడా ఇస్తున్నారట.

– ఇది వరకు వేడి వేడి మీల్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడలా కాదు. ప్యాకింగ్ మీల్స్ మాత్రే ఇస్తున్నారు. అలాగే మొత్తం మీల్స్ సరిపడా వాటర్ ఇస్తున్నారు

– ఇది వరకు విమానంలో వాష్ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుడు అన్‌ లిమిటెడ్. ఎన్నిసార్లైనా వెళ్లొచ్చు.

– కాగా ఫ్లైట్‌లో 30 శాతం మందికి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు లేవు. అయితే కొంతమంది మాత్రం సేఫ్టీ కోసం.. మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకున్నట్లు ఆమె తెలిపింది.

– బెంగుళూరులో ఫ్లైట్ దిగిన తర్వాత అందర్నీ భౌతిక దూరం పాటిస్తూ బస్సులు ఎక్కించి, క్వారంటైన్ చేసిన మంచి హోటల్ గదులకు తీసుకువెళ్తున్నట్లు ఆమె పేర్కొంది.

Read More:

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్‌ లెసన్స్

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

దిల్‌రాజు వెడ్స్ తేజస్విని.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం