AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించిన 21 మంది చిన్నారులు.. 20రోజుల పసికందు కూడా

ముంబయి తర్వాత దేశంలో కరోనా వైరస్​ ప్రభావం మధ్యప్రదేశ్​లోని​ ఇండోర్ లో తీవ్రంగా ఉంది. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పెరుగుంది. అయితే తాజాగా అందిన గుడ్ న్యూస్ ఏంటంటే… ఈ జిల్లాలో గత రెండు నెలల్లో మొత్తం 21 మంది చిన్నారులు కోవిడ్-19​ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు జిల్లా వైద్య‌శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 20 రోజుల నవజాత శిశివు కుడా ఉన్నట్లు వెల్ల‌డించారు. చిన్నారుల తల్లులు.. వారు కోలుకోవడానికి ఎంతో […]

కరోనాను జయించిన 21 మంది చిన్నారులు.. 20రోజుల పసికందు కూడా
Ram Naramaneni
|

Updated on: May 11, 2020 | 6:58 PM

Share

ముంబయి తర్వాత దేశంలో కరోనా వైరస్​ ప్రభావం మధ్యప్రదేశ్​లోని​ ఇండోర్ లో తీవ్రంగా ఉంది. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌ర స్థాయిలో పెరుగుంది. అయితే తాజాగా అందిన గుడ్ న్యూస్ ఏంటంటే… ఈ జిల్లాలో గత రెండు నెలల్లో మొత్తం 21 మంది చిన్నారులు కోవిడ్-19​ నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు జిల్లా వైద్య‌శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 20 రోజుల నవజాత శిశివు కుడా ఉన్నట్లు వెల్ల‌డించారు. చిన్నారుల తల్లులు.. వారు కోలుకోవడానికి ఎంతో క‌ష్ట‌ప‌డ్డ‌ట్లు పేర్కొన్నారు. అందరిలాగే చిన్నారులు, వారి తల్లులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్​లో ఉండాలని అధికారులు సూచించారు.

ఇండోర్​లోని చాయిత్రం ఆస్పత్రిలో 20 రోజుల శిశువు సహా… రెండు నెలలు, 18 నెలల చిన్నారులు.. గత 15 రోజుల్లో వ్యాధి న‌య‌మై డిశ్చార్జ్​ అయినట్లు సీనియర్ వైద్యులు డా. రష్మి షాద్​ తెలిపారు. ట్మీట్మెంట్ అనంతరం నిర్వహించిన క‌రోనా టెస్టుల్లో వారికి రెండు సార్లు నెగిటివ్ వచ్చినట్లు వివరించారు. వీరితో పాటు రెండేళ్ల వయసులోపు ఉన్న మరో 18 మంది చిన్నారులు శ్రీ ఔరబిందో ఆస్పత్రి నుంచి గత 45 రోజుల్లో డిశ్చార్జి అయ్యారని వవ‌రించారు.చిన్నారులంతా రోగ నిరోధక శక్తితోనే వైరస్​పై పోరాడి గెలిచినట్లు డాక్ట‌ర్లు చెప్పారు.

Follow Us