అమరావతి: డీఎస్సీ-1998లో క్వాలిఫైడ్ అయిన 36 మందికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ బేసిస్ లో నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. అలాగే 2008లో డీఎడ్, బీఎడ్ అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్‌లో ఉన్న వారికి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.
అలాగే 1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మరో 22 ఆస్పత్రుల స్థాయి పెంపునకు ఆమోదించింది. 31 ఆస్పత్రుల అప్‌గ్రెడేషన్, మిగిలిన 22 హాస్పటల్స్ అప్‌గ్రెడేషన్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి