శంషాబాద్‌లో విమానం ఎగిరింది. ఎక్కడికంటే?

చాలా రోజుల తర్వాత హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానం ఎగిరింది. అది కూడా స్వదేశంలో ఏదో డెస్టినేషన్‌కు కాదు.. ఏకంగా కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికా దేశానికి. ఇంత క్లిష్ట పరిస్థితిలో అమెరికాకు విమానమా ?

శంషాబాద్‌లో విమానం ఎగిరింది. ఎక్కడికంటే?
Follow us

|

Updated on: Apr 07, 2020 | 5:58 PM

Third evacuation flight sent from Shamsabad: చాలా రోజుల తర్వాత హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానం ఎగిరింది. అది కూడా స్వదేశంలో ఏదో డెస్టినేషన్‌కు కాదు.. ఏకంగా కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికా దేశానికి. ఇంత క్లిష్ట పరిస్థితిలో అమెరికాకు విమానమా ? ఈ అనుమానం కలుగుతున్నా ఇది అక్షరాలా నిజం.

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి మంగళవారం మధ్యాహ్నం సుదీర్ఘ ప్రయాణ లక్ష్యంలో ఎయిరిండియా విమానం ఎగిరింది. ఏకంగా 99 మంది ప్రయాణికులను మోసుకుంటూ నింగిలోకి ఎగిరిన ఎయిరిండియా విమానం ఏకంగా అమెరికా దాకా సాగనుంది. అసలే అమెరికా కరోనా వైరస్ ప్రభావంతో మృత్యుదిబ్బగా మారుతోంది. ఈసమయంలో అమెరికాకు విమానం ఎందుకు ఎగిరిందన్న సందేహాలు మొదలయ్యాయి.

మార్చి 22వ తేదీ తర్వాత శంషాబాద్ నుంచి విమానాల రాకపోకలు తగ్గడం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత వారం రోజుల్లో ఒక్క విమానమూ ఎగరని పరిస్థితికి దారితీసింది. అయితే.. ఇండియాలో వుండిపోయిన అమెరికన్లను ప్రత్యేక విమానాల్లో తమ దేశానికి పంపాలంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన విఙ్ఞప్తులకు స్పందించిన కేంద్రం.. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ల నుంచి ప్రత్యేక రిలీఫ్ విమానాలను పంపాలని నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి మంగళవారం 99 మంది అమెరికన్లతో కూడిన ఎయిరిండియా విమానం అగ్రరాజ్యానికి ఎగిసింది.

విమానాల రాకపోకలు నిలిచిపోయిన తర్వాత ఇప్పటి వరకు శంషాబాద్ నుంచి కేవలం మూడు ఎవాక్యుయేషన్ విమానాలు మాత్రమే ఎగిరాయి. కార్గో సేవల కోసం మాత్రం కొన్ని విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికాకు పయనమైన ఎయిరిండియా విమానం రేపు ఉదయానికి అక్కడికి చేరుకోనున్నది. అయితే అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను అదే విమానంలో తీసుకువస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు.